Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం భయా లు ప్రధానంగా ఐటి రంగంలోని ఉద్యో గుల ఉపాధిని తీవ్రంగా దెబ్బ తీస్తు న్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డిన్ 716 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 3.5 శాతానికి సమానం. లింక్డిన్లో దాదాపు దాదాపు 20వేల మంది పని చేస్తున్నారు. ఈ కంపెనీ ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగులను ఇంటికి పంపించడం గమనార్హం. అలాగే చైనాలో ప్రత్యేకంగా సేవలు అందిస్తున్న జాబ్ అప్లికేషన్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితే దీనికి కారణమని లింక్డిన్ సిఇఒ ర్యాన్ రోస్లాస్కి వెల్లడించారు.