Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు తన జీవితం కూడ చెత్త కుండి నుండి మొదలయినదే..! . ఒక మానవతామూర్తి కంటికి జిక్కి అనాధాశ్రమం ఒళ్ళో పెరిగిన అమావాస్య ఆడపిల్ల తను. కొంత వయసొచ్చాక సమాజం పట్ల
ఏర్పడిన భావనతో , తను ఎవరో తెలుసుకోవాలన్న కసి, పట్టుదల తనలో మొదలయ్యాయి. తన
కష్టానికి ప్రతిఫలమే తన ఒంటిపై ఇప్పుడున్న కాకి చొక్క .
చిత్ర విచిత్రాల విన్యాసాలతో ముందుకు పరుగెడుతున్నా... మనిషి మనుగడలో ఏదో! వెనకబడుతుంది. ప్రపంచం.
సృష్టి పుట్టుక మొదలు తనతోనే, కానీ... తన పుట్టుక మాత్రం విసిరేసిన చెత్తకుప్ప నుండి మొదలౌతుంది. అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అరిష్టం కొందరికి. పుట్టింది ఆడపిళ్ళైతే భారం మరికొందరికి. సమాజం నమ్మిన నిజం ఒక్కటే ఆడపిల్ల ఆస్తికి అర్హురాలు కాదు. మగువ లేనిదే మనుగడలేదని ఎప్పుడు అర్ధం చేసుకుంటారో ఈ మనుషులు. ఒక పసికందు అరుపు చెత్తకుండిలో ఏకదాటిగా వినిపిస్తోంది. ఇంకా మనుషుల్లో మిగిలున్న కాస్తో కూస్తో మానవత్వం వీధి కుక్కల్ని, ఆ పసికందుని చేరకుండా ఆపుతుంది. ఈ సమాచారం పోలీసుల వరకు చేరింది.
క్షణం కూడ ఆలస్యం చేయ లేదు. పోలీసులు ఈ విషయంలో. ఎందుకంటే! ఆ స్టేషన్ ఎస్ఈ అమ్మాయి కాబట్టి.
తనే....!, సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవి రుద్ర. పరిచయస్థులు ముద్దుగా రుద్ర అని పిలుస్తారు తనని.
తన చేతజిక్కిన ఏ కేసు, తనని ఓడించలేకపోయ్యేవి. ఆడదానికి కరువైన గౌరవానికి తిరిగి ప్రాణం పోయాలన్న తపన తనది. ఎందుకంటే...! ఒకప్పుడు తన జీవితం కూడ చెత్త కుండి నుండి మొదలయినదే..! . ఒక మానవతామూర్తి కంటికి జిక్కి అనాధాశ్రమం ఒళ్ళో పెరిగిన అమావాస్య ఆడపిల్ల తను. కొంత వయసొచ్చాక సమాజం పట్ల ఏర్పడిన భావనతో , తను ఎవరో తెలుసుకోవాలన్న కసి, పట్టుదల తనలో మొదలయ్యాయి. తన కష్టానికి ప్రతిఫలమే తన ఒంటిపై ఇప్పుడున్న కాకి చొక్క . తను ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి వారంలోనే చాటుగా దర్యాప్తు మొదలెట్టింది. చివరికి తన గురించి తాను పూర్తి వివరాలు సాధించింది. కోట్లలో ఆస్తులు, ఒంటినిండా నగలు, కట్టిన బట్టలు మళ్ళీ కట్టని కుటుంబం, మనసు నిండ మరకలు, అంతటి ఆడంబరాల మధ్య మూఢనమ్మకాలు కూడిన ఒక పెద్దమనిషి. ఆ వంశాన్ని ముందుకు నడపడానికి వాళ్లకు కావలసింది వారసుడు. వారసురాలు కాదు!. అందుకే అమావాస్య రోజు పుట్టిన దేవి రుద్ర చెత్తకుప్పల పాలయ్యింది. పబ్లీక్ని అడ్డు తొలగిస్తున్న కానిస్టేబుల్స్ మధ్య నుండి దేవి రుద్ర హుందాగా నడుచుకుంటూ వస్తుంది.
''మాలిక్ ట్రాఫిక్ క్లియర్ చేయండి వెంటనే...'' ఆకలితో అలమటిస్తున్న పసికందుని జాలితో గుండెలకత్తుకుని , హెడ్ కానిస్టేబుల్ని హెచ్చరించింది దేవి రుద్ర . '' ఒకే మేడమ్'' ''అలాగే చుట్టు ప్రక్కల అన్ని హాస్పిటల్లో విచారణ మొదలు పెట్టండి. ఈ టు డేస్లో డెలివరీ అయినా కేస్ రిపోర్ట్స్ మొత్తం
చెక్ చేయండి. పాప బ్లెడ్ సాంపుల్స్ తీసుకోండి. ఈ వారం లోపు ఆ బిడ్డ ఇల్లు చేరాలి.
ఆ శారదా...''
''ఆ మేడమ్ చెప్పండి'' '' మీ బాబు ఇంకా పాలు మరవలేదు కదూ...?'' తన పక్కనే నిల్చున్న మరో లేడి కానిస్టేబుల్ని అడిగింది రుద్ర. ''ఎస్ మేడమ్''
'' మీకు ఇబ్బంది లేకుంటే వెనక సీట్లో కూర్చొని పాపకి పాలు ఇవ్వగలరా.''
''సరే మేడమ్''
''ఆ.... రజత్ ఇక్కడ ప్రతి సిసి టీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఈ వారం లోపు, ఎట్టి పరిస్థితుల్లో పాప తన ఇంటికి చేరాలి.''
''షూర్
మేడమ్''
వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏ క్లూని వదలకుండా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గడిచిన మూడు రోజులు పాపకి ఏ లోటు లేదు. స్టేషన్లో ముగ్గురు లేడి కానిస్టేబుల్ ఉన్నందున ఆ పాపకి ఆలనా పాలన అన్ని అమ్మలా చూసుకుంటున్నారు. కేసు త్వరగానే చివరి దశకు చేరుకుంది. సరిగ్గా ఇరవై ఆరేళ్ళ క్రితం తనని విసిరేసిన ఆ ఇంటి దగ్గరే ఎన్క్వైరి ఆగింది. ఆ పాప మరెవరో కాదు రుద్ర తమ్ముని కూతురు. ఆ విషయం రుద్ర మనసులోనే సర్దిచెప్పుకుంటుంది.
పాపని తీసుకుని రుద్ర ఒంటరిగా బయలుదేరింది. బిగుసుకుని ఉన్న తలుపులను నిలువెల్లా నిండిన కోపంతో ఒక్క తన్నుతో తెరుచుకుని లోపలికి సాగిపోయింది రుద్ర.
ఎదురుగా సోఫాలో పేపర్ చదువుతూ కూర్చున్న రుద్ర తమ్ముడు లేచి నిల్చున్నాడు, విరుచుకు పడిన ఆ తలుపుల ధాటికి.
రుద్ర చేతిలో బిడ్డని చూసిన ఆ పాప తల్లి దుఃఖాన్ని దిగమింగుకుని ఆనందబాష్పాలతో కూతురిని ముద్దాడుతుంది.
భార్యని అడ్డుకోవడానికి , నిల్చున్న చోటు నుండి ముందుకు కదలబోతున్న తమ్ముడిని , రుద్ర రివాల్వర్ తో ఆపేసింది. ఒంట గదిలోంచి బయటకొస్తున్న రుద్ర తల్లి జరుగుతున్న సంఘటనకు ఆందోళన చెందుతూ ఆశ్చర్యంగా రివాల్వర్ పట్టుకుని ఉన్న చేతిని గమణిస్తుంది. ఎంత కాలం గడిచిన బిడ్డ తొలి చూపులను ఏ తల్లి మరవదు. రివాల్వర్ పట్టుకున్న అరచేతి వెనకబాగంలో రూపాయి బిల్లంత పుట్టుమచ్చ రుద్ర తల్లికి కనబడుతుంది.
ఒకప్పుడు అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లనీ, తన భర్త వదిలేసిన ఆ పాపే ఈ రుద్ర అని తల్లికి అర్థమయ్యింది.
''ఎక్కడ్రా... నీ అయ్యా ? ఎక్కడ్రా... నీ నానమ్మ ? దీనికంతటికీ కారణం వాళ్లే కదరా... పిలవర వాళ్ళని నా ముందుకి తరతరాలుగా పుట్టింది ఆడపిల్లనీ మీరు విసిరేసినట్టు! , పుట్టింది మగ బిడ్డని మేము కూడ విసిరేస్తే ఎక్కడా మీ బతుకులు. పెళ్ళాం పక్కలో పడుకోడానికి అడ్డురాణి రోజులు , అడపిల్ల పుట్టినప్పుడు అవుతుందా రోజు. నీ యయ్యా ఎక్కడా వాళ్ళు ''
గట్టిగా అరుస్తూ ప్రశ్నిస్తోంది రుద్ర.
తల పైకెత్తి కంటితో చూపాడు రుద్ర తమ్ముడు పై అంతస్తులో ఉన్నారు అన్నట్టుగా,
గబగబ వెళ్లి నిల దీయబోయింది ఆ నింధితులని రుద్ర.
తను చెయ్యడానికి అక్కడ ఎం లేదు. తన నాన్నమ్మ , తండ్రి ఇద్దరు అక్కడ పక్షవాతంలో పడివున్నారు. రుద్ర మనసులో కోపం చల్లారి కన్నీరు చేరింది. వెను తిరిగి కిందికి నడిచింది. అనురాగంతో చూస్తున్న తల్లి చెంతకు చేరి రుద్ర బోరున ఏడ్చింది. తన తల్లికి రుద్ర పుట్టినప్పుడు మొదటి సారి కలిగిన స్పర్శ లోని అనుభూతి మళ్ళీ ఇన్నాళ్ళకి కలిగింది.
రుద్ర తల్లికి తనే తన కూతురన్న విషయం , తన తల్లి పసిగట్టిన సంగతి రుద్రకి అర్థమయ్యింది. మనం చేసిన తప్పులకి దేవుడు ఏదో ఒక రోజు గుణపాఠం చెబుతాడు అని మనసులో అనుకుంటూ అక్కడినుండి బయలుదేరింది. రుద్ర.
- కొమారి భరత్,
9951291442