Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మ సంరక్షణలో మృతకణాలు తొలగించటం చాలా ముఖ్యం. లేదంటే ముఖంపై మురికి, ధూళి పేరుకుపోయిన చోట నల్లమచ్చలు, మొటిమలూ వస్తాయి. ప్రతిసారీ వీటి కోసం మార్కెట్లో దొరికే స్క్రబ్‌లు వాడతాం. వాటికి బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు.
- అరకప్పు పంచదారకు రెండు చెంచాల ఆలివ్‌నూనె చేర్చండి. మూత బిగుతుగా ఉన్న గాజు సీసాలో భద్రపరచుకోండి. దీన్ని వారంలో రెండు మూడు సార్లు ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఆపై పది నిమిషాలాగి చల్లటినీళ్లతో కడిగేస్తే సరి. మేను నిగనిగలాడుతుంది.
- మూడు చెంచాల చాక్లెట్ పొడిలో రెండు చెంచాల కొబ్బరి నూనెను కలపాలి. ఇది ముఖానికి మంచి స్క్రబ్. కాస్త ఆరాక...చేతుల్ని నీళ్లతో తడిపి వేళ్లతో మృదువుగా మర్దన చేయండి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా, మెరిసి పోతుంది.
- మూడు చెంచాల చక్కెరలో మూడు చెంచాల తేనె, చెంచా నిమ్మరసం కలపాలి. ఈ స్క్రబ్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇది మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరిపించి, ముఖాన్ని కాంతులీనేలా చేస్తుంది.
- రెండు చెంచాల ఓట్స్‌లో కాసిని పాలు, చెంచా ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓట్స్ మెత్తబడే వరకూ అలాగే వదిలేసి... తర్వాత కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి రాసి ఆరనివ్వాలి. ఆపై సున్నితంగా రుద్దుతూ కడిగేస్తే సరి. చర్మం మృదువుగా మారి యవ్వనంగా కనిపిస్తాం.