Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలాలు మారే కొద్ది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఇందుకు తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి... ఆరోగ్యం అంటే కేవలం శరీరమే కాదు, జుట్టు పైనా శ్రద్ధ వహించాలి. కొన్ని అలవాట్లు మంచివి అయినట్లే, కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. కొన్ని మంచి అలవాట్లు అయినప్పటికీ కాలాన్ని బట్టి వాటి ప్రభావం మారుతుంది. అలాంటి కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం...
వేసవిలో ఉండే ఎండ వల్ల జుట్టు పొడిబారిపోతుంటుంది. అందువల్ల విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే జుట్టు మృధుత్వాన్ని కోల్పోతుంది.
బయటకు వెళ్లాల్సి వస్తే టోపీలు, స్కార్ఫ్‌లు వంటి ధరించడం వల్ల ఎండ నుంచి రక్షణ పొందవచ్చు.
వేసవి తాపానికి ఎక్కువ మంది స్విమ్మింగ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆ సమయంలో జుట్టు ఎక్కువ సేపు నీటిలో నానుతుంది. అంతేకాదు, అటువంటి నీటిలో క్లోరిన్ తక్కువ జూన కలిగి ఉంటుంది. దీని వల్ల జుట్టు పొడిగా, బలహీనంగా, పెళుసుగా తయారవుతుంది. ఇటువంటి సమయంలో అవసరమైన మాయిశ్చరైజర్స్ రాసుకోవడం వల్ల కొంత వరకు జుట్టను సంరక్షించుకోవచ్చు.
వేడి నీటితో స్నానం చేయడం శరీరానికి చాలా ఉపశాంతిగా అనిపిస్తుంది. కానీ వేడి నీళ్ళు జుట్టులోని సహజ నూనెలను కరిగిస్తాయి. అదనంగా, అధిక ఉష్ణోగ్రతలు తలపై ఉన్న సేబాషియస్ గ్రంధులను ప్రేరేపిస్తాయి. వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల పొడిబారి, ఉన్న జుట్టు వేడి నీటి స్నానం వల్ల మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవేళ వేడి నీటితో తలస్నానం చేసినప్పటికీ మళ్ళీ చల్లని నీటితో తలకు కడగడం వల్ల కొంత మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. అంతేకాదు, తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు ఉన్న తడిని తొలగించడానికి టవల్‌తో రుద్దుతుంటాం. దీని వల్ల కూడా సమస్య వస్తుంది. ఇందుకు కాటన్ టవల్‌తో నెమ్మదిగా తుడవాలి.
తల దువ్వడానికి చెక్క దువ్వెనలు ఉపయోగించడం వల్ల జుట్టు చిక్కులు త్వరగా విడవడతాయి.
హెయిర్ డ్రయర్స్ వాడటం వల్ల జుట్టు మృధుత్వాన్ని కోల్పోతుంది. ఇవి జుట్టును పెళుసుగా మారుస్తాయి. సహజంగా ఆరబెట్టుకునేందుకు మాత్రమే ప్రయత్నించాలి.
వేసవిలో పొడవాటి జుట్టు అనేక సమస్యలను సష్టిస్తుంది. అలాంటి జుట్టు ఉన్నవారు ఎక్కువగా బిగుతుగా జుట్టును పట్టేసి ఉంచినట్లు చేయకూడదు. అంతేకాదు జుట్టు చిట్లకుండా జాగ్రత్తలు పాటించాలి.
హెయిర్ కండిషనర్స్ లాంటి ఉత్పత్తులు వాడుతున్నట్లయితే వేసవి కాలానికి అవి సరిపోతాయా లేదా అని ఒకసారి పరిశీలించుకోండి. అవసరమైతే అలాంటి ఉత్పత్తులు ఏవైనా ఉంటే మార్చడానికి వెనుకాడకండి. తేలికపాటి ఉత్పత్తులతో వేసవిలో జుట్టు సంరక్షణ చేసుకోవడం వల్ల మృధుత్వాన్ని కాపాడుకోవచ్చు.
ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో వేసవిలో జుట్టు సంరక్షణ చేసుకోవచ్చు.