Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ షూటౌట్
- ఫిఫా ప్రపంచకప్
నవతెలంగాణ-దోహా
లియోనల్ మెస్సి, అర్జెంటీనా ప్రపంచకప్ ఆశలు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. బంతితో మాయజాలం ప్రదర్శిస్తున్న లియోనల్ మెస్సి అర్జెంటీనాను ముందుండి సెమీస్‌కు నడిపించాడు. నెదర్లాండ్స్‌తో క్వార్టర్ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో గెలుపొందిన అర్జెంటీనా.. ఆరెంజ్ ఆర్మీకి మరోసారి పీడకల మిగిల్చింది. 1978 ప్రపంచకప్ ఫైనల్లో షూటౌట్లో డచ్ జట్టును జయించిన అర్జెంటీనా తాజాగా క్వార్టర్స్‌లోనే ఆ పని చేసింది. అదనపు సమయం అనంతరం అర్జెంటీనా, నెదర్లాండ్స్ 2-2తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఫలితాన్ని పెనాల్టీ షూటౌట్‌తో తేల్చారు. అర్జెంటీనా తరఫున మెస్సి, లియాండ్రో, మోనిటెల్, మార్టినెజ్ గోల్స్ కొట్టగా, ఫెర్నాండేజ్ క్రాస్‌బార్‌ను ఢకొీట్టాడు. నెదర్లాండ్స్ తరఫున విర్గిల్, స్టీవెన్‌లు తొలి రెండు పెనాల్టీలను వృథా చేశారు. కూప్మీనర్స్, వేగోస్ట్, జాంగ్‌లు చివరి మూడు పెనాల్టీలను గోల్స్‌గా మలిచినా అప్పటికే అర్జెంటీనా సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో క్రోయేషియాతో అర్జెంటీనా తలపడనుంది.
ఆద్యంతం ఉత్కంఠ : సహజంగానే నెదర్లాండ్స్‌పై అర్జెంటీనా ఆధిపత్యం చూపింది. 35వ నిమిషంలో మోలినా గోల్‌తో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 73వ నిమిషంలో మెస్సి పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. మ్యాచ్ మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా అర్జెంటీనా రెండు గోల్స్‌తో రేసులోకి వచ్చింది. 83వ నిమిషంలో వెగోస్ట్ తొలి గోల్ సాధించాడు. ఇంజూరీ సమయంలో (90+11) లభించిన ఫ్రీ కిక్‌ను వెగోస్ట్ మళ్లీ గోల్‌గా మలిచాడు. ఊహకందని గోల్‌తో స్కోరు సమం చేసిన నెదర్లాండ్స్ మ్యాచ్‌ను అదనపు సమయానికి తీసుకెళ్లింది. ఇక పెనాల్టీ షూటౌట్లో సైతం ఆరంభంలో 0-2 వెనుకంజలో నిలిచినా.. వరుసగా మూడు గోల్స్‌తో మరోసారి రేసులోకి వచ్చి ఆశ్చర్యపరిచింది.