Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక సర్వసభ్య సమావేశం తీర్మానం
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రక్షాళనపై ఓ వైపు సుప్రీంకోర్టు నియమిత పర్యవేక్షణ కమిటీ పని చేస్తుండగానే.. కొందరు సభ్యులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అర్శద్ అయూబ్, జి.వినోద్, శేషు నారాయణలతో కూడిన ఓ వర్గం ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. జనవరి 10న హెచ్‌సీఏ ఎన్నికలకు ఎస్‌జీఎంలో తీర్మానం ఆమోదించారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా సంపత్‌ను నియమించారు.
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన దిగ్గజ స్ప్రింటర్ పి.టి ఉషను హైదరాబాద్‌కు చెందిన 7హెచ్ స్పోర్ట్స్ డైరెక్టర్ బి. వెంకటేశ్ ఢిల్లీలోని ఐఓఏ కార్యాలయంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పి.టి ఉష నాయకత్వంలో క్రీడా రంగంలో భారత్ మంచి ఫలితాలు సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.