Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో రోహిత్ దూరం
- షమి, జడేజా సైతం ఔట్
ముంబయి : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు పేసర్ మహ్మద్ షమి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు గాయంతో దూరమయ్యారు. రెండో వన్డేలో చేతి బొటనవేలికి గాయం కావటంతో స్వదేశానికి చేరుకున్న రోహిత్ శర్మ.. ముంబయిలో వైద్య నిపుణుల సలహా మేరకు విశ్రాంతి తీసుకోనున్నాడు. భుజం గాయం నుంచి షమి, మోకాలి గాయం నుంచి జడేజా పూర్తిగా కోలుకోలేదని ఎన్సీఏ తెలిపింది. దీంతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు అభిమన్యు ఈశ్వరన్‌ను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ భారత జట్టుకు ఎంపిక చేసింది. భారత్-ఏకు నాయకత్వం వహించిన అభిమన్యు ఈశ్వరన్ బంగ్లాదేశ్-ఏపై వరుసగా 141, 157 ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. నవదీప్ సైని, సౌరభ్కుమార్లను షమి, జడేజాల స్థానంలో జట్టులోకి తీసుకున్నారు. ఫాస్ట్‌బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌ను సైతం టెస్టు జట్టులోకి తీసుకుంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు డిసెంబర్ 14న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.