Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ 256/5
హైదరాబాద్ : తన్మయ్ అగర్వాల్ (116 బ్యాటింగ్, 210 బంతుల్లో 14 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 46/4తో హైదరా బాద్ పీకల్లోతు కష్టాల్లో కూరుకోగా ఆల్‌రౌండర్ రవితేజ (72, 97 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఐదో వికెట్‌కు 141 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి సెషన్లో తమిళనాడు బౌలర్లు వరుస వికెట్లతో హడలెత్తించగా, లంచ్ తర్వాత హైదరాబాద్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. తన్మయ్ అగర్వాల్ అజేయ సెంచరీతో చెలరేగాడు. మికిల్ జైస్వాల్ (32 నాటౌట్) అజేయగా ఆడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 70.4 ఓవర్లలో 256/5తో గౌరవప్రద స్థితిలో కొనసాగుతోంది. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. వెలుతురు లేమితో ఓ అరగంట ముందుగానే ఆగిపోయింది.