Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడుతో రంజీ మ్యాచ్
హైదరాబాద్ : తమిళనాడుతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (179, 273 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్), జగదీశన్ (116, 97 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాబా అపరాజిత్ (115 నాటౌట్, 165 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగటంతో తమిళ నాడు తొలి ఇన్నింగ్స్‌ను 519/4 పరుగుల వద్ద డిక్లరేషన్ ఇచ్చింది. కెవిన్ (36), బాబా ఇంద్రజిత్ (48) సైతం ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన తమిళనాడు.. హైదరా బాద్‌ను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిలిచి విజయంపై కన్నేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 28/0 వద్ద నిలిచింది. తన్మరు (5), తనరు (9) అజేయంగా ఆడుతున్నారు. అభిరత్ రెడ్డి (14) రిటైర్డ్ హర్ట్‌గా నిష్క్రమించాడు. తమిళనాడుతో రంజీ మ్యాచ్‌లో నేడు ఆఖరు రోజు. తొలి ఇన్నింగ్స్ కోల్పోయిన హైదరాబాద్ నేడు మూడు సెషన్ల పాటు ఆడితేనే తమిళనాడు జోరుకు చెక్ పెట్టవచ్చు.