Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2 రజతాలు, 3 కాంస్యాలు సొంతం
నవతెలంగాణ-హైదరాబాద్
జాతీయ జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్స్ పోటీల్లో తెలంగాణ సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్ రేసుల్లో తెలంగాణ రోయర్లు ఏకంగా ఐదు పతకాలు కొల్లగొట్టారు. జూనియర్ ఉమెన్ కాక్స్డ్ ఎయిట్ విభాగంలో తెలంగాణ అమ్మాయిలు రెండో స్థానంలో నిలిచారు. కె. ఉదయభాను, ఎం. శ్రావ్య, వి. ప్రవళిక, ఎ. మహలక్ష్మి, కె. నందిని, కె. పూర్ణిక, వి. సాయి ప్రసన్న, కె. అనురాధ, కె సింధు (కాక్స్)లు 03;5.9 సెకండ్లలో రేసును పూర్తి చేసి రజత పతకం సొంతం చేసుకున్నారు. జూనియర్ ఉమెన్స్ సింగిల్ స్కల్ విభాగంలో డి.హేమలత 04;47.9 సెకండ్లలో రేసు ముగించింది. సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఇక జూనియర్ మెన్స్ కాక్స్డ్ ఎయిట్ విభాగంలో అబ్బాయిలు కాంస్య పతకం సాధించారు. శ్రావణ్ కుమార్, గణేశ్ కుమార్, రాకేశ్, రామకృష్ణ, కార్తీక్, హేమంత్, రాజేశ్, సాయి గణేశ్‌లు 03;37.4 సెకండ్లలో రేసు ముగించారు. ఉమెన్స్ కాక్స్‌లెస్ పెయిర్ విభాగంలో ఉదయభాను, పూర్ణిక జోడీ 04;41.8 టైమింగ్‌తో కాంస్యం దక్కించుకుంది. ఉమెన్స్ కాక్స్‌లెస్ ఫోర్ విభాగంలో నందిని, శ్రావ్య, సాయి ప్రసన్న, అనురాధ 04;23.1 టైమింగ్‌తో రేసు పూర్తి చేసి కాంస్య పతకం సాధించింది. 42వ జాతీయ జానియర్ రోయింగ్ చాంపియన్‌షిప్స్ విజేతలకు జాతీయ రోయింగ్ సమాఖ్య అధ్యక్షురాలు, ఐఓఏ ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి సింగ్, జాతీయ రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ బహుమతులు ప్రదానం చేశారు.