Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టెస్టులో భారత్ విజయం
- 188 పరుగుల తేడాతో గెలుపు
- ఛేదనలో బంగ్లాదేశ్ 324 ఆలౌట్
నవతెలంగాణ-చిట్టగాంగ్
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 513 పరుగుల రికార్డు ఛేదనలో బంగ్లాదేశ్‌ను 324 పరుగులకే కుప్పకూల్చిన టీమ్ ఇండియా.. 188 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐసీసీ డబ్లూటీసీ జాబితాలో నాల్గో స్థానంతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టును ఆరంభించిన భారత్.. భారీ విజయంతో ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. డిసెంబర్ 22 నుంచి జరిగే రెండో టెస్టులోనూ నెగ్గితే టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ అవకాశాలను భారీగా మెరుగుపడనున్నాయి!. స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4/77), కుల్దీప్ యాదవ్ (3/73) మాయజాలంతో ఐదో రోజు ఉదయం 11.2 ఓవర్లలోనే లాంఛనం ముగిసింది. షకిబ్ అల్ హసన్ (84, 108 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) బంగ్లా ఓటమి అంతరాన్ని తగ్గించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో పాటు విలువైన 40 పరుగుల ఇన్నింగ్స్ నమోదు చేసిన కుల్దీప్ యాదవ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
11.2 ఓవర్లలోనే.. : ఐదో రోజు ఉదయం పిచ్ మళ్లీ బ్యాటింగ్‌కు సులువుగా మారుతుందనే భయం భారత్‌ను వేధించినా.. స్పిన్నర్లు మాయజాలం చేశారు. ఓవర్‌నైట్ బ్యాటర్లు షకిబ్ అల్ హసన్ (84), మెహిది హసన్ మిరాజ్ (13) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. పేసర్ సిరాజ్ ఓవర్లో మెహిది మిరాజ్ క్యాచౌట్‌గా నిష్క్రమించగా.. మిగతా మూడు వికెట్లను అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చూసుకున్నారు. షకిబ్ అల్ హసన్ అర డజను బౌండరీలు, సిక్సర్లతో కాసేపు అలరించాడు. అతడికి జోరుకు కుల్దీప్ బ్రేక్ వేశాడు. క్లీన్‌బౌల్డ్‌తో బంగ్లా కెప్టెన్‌ను సాగనంపాడు. ఎబాడాట్ హోస్సేన్ (0)ను కుల్దీప్ డకౌట్ చేయగా.. తైజుల్ ఇస్లాం (4) వికెట్లను గిరాటేసిన అక్షర్ పటేల్ బంగ్లాదేశ్ కథ ముగించాడు. 113.2 ఓవర్లలో 324 పరుగులకు బంగ్లాదేశ్ కుప్పకూలింది. 188 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 404/10
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 150/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 258/2 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : నజ్ముల్ (సి) పంత్ (బి) ఉమేశ్ 67, జాకిర్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 100, అలీ (బి) అక్షర్ 5, దాస్ (సి) ఉమేశ్ (బి) కుల్దీప్ 19, ముష్ఫీకర్ (బి) అక్షర్ 23, షకిబ్ (బి) కుల్దీప్ 84, నురుల్ (స్టంప్డ్) అక్షర్ 4, మిరాజ్ (సి) ఉమేశ్ (బి) సిరాజ్ 13, తైజుల్ (బి) అక్షర్ 4, హోస్సేన్ (సి) శ్రేయస్ (బి) కుల్దీప్ 0, ఖలీద్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం :(113.2 ఓవర్లలో ఆలౌట్) 324.
వికెట్ల పతనం : 1-124, 2-131, 3-173, 4-208, 5-234, 6-238, 7-283, 8-320, 9-324, 10-324.
బౌలింగ్ : సిరాజ్ 19-4-67-1, ఉమేశ్ యాదవ్ 15-3-27-1, అశ్విన్ 27-3-75-1, అక్షర్ పటేల్ 32.2-10-77-4, కుల్దీప్ యాదవ్ 20-3-73-3.