Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోటెస్ట్‌లో 8వికెట్ల తేడాతో గెలుపు
కరాచీ: మూడోటెస్ట్లోనూ ఇంగ్లండ్ టెస్టు 8వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 60ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై క్లీన్‌స్వీప్ చేసింది. 167పరుగుల లక్ష్యంలో భాగంగా ఓవర్‌నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 112పరుగులతో మంగళవారం ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు 28.1ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 170పరుగులు చేసి గెలిచింది. డక్కెట్(82), బెన్ స్టోక్స్(35) ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ బౌలర్లు అబ్రార్ అహ్మద్ చివరి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాగలిగాడు. కరాచీలో విజయంతో 2022లో ఆడిన మొత్తం 10టెస్టుల్లో ఇంగ్లండ్‌కు 9వ విజయం. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్, సిరీస్ బ్రూక్‌కు లభించాయి.