Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి జరిగే రెండో టెస్ట్‌కు పేసర్ నవ్‌దీప్ సైనీ దూరమయ్యాడు. తొలి టెస్ట్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పటికే రెండో టెస్ట్‌కూ దూరం కాగా.. మంగళవారం నవ్‌దీప్ సైనీ కూడా జట్టుకు అందుబాటులో ఉండడని బిసిసిఐ పేర్కొంది. డిసెంబర్ 7న మీర్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా 5పరుగుల తేడాతో ఓడినా.. చివర్లో బ్యాటింగ్‌కు దిగి రోహిత్ శర్మ 28బంతుల్లో 51పరుగులు చేసి విజయానికి టీమిండియాను చేరువగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక నవ్‌దీప్ సైనీ ఆటగాళ్లతో కలిసి ఉన్నా.. కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో అతడు బెంగళూరులోని ఎన్సిఏకు బయల్దేరి వెళ్లాడు. సైనీ చివరి సారిగా ఓ టెస్ట్ మ్యాచ్‌ను ఈ ఏడాది జనవరిలో బ్రిస్బెన్ వేదికగా ఆడాడు.
రెండో టెస్ట్‌కు భారతజట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్, ఛటేశ్వర పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కెఎస్ భరత్(వికెట్ కీపర్లు), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్.