Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆలిండియా అమెరికన్ ఫుట్బాల్ జాతీయ చాంపియన్షిప్ టైటిల్ను తెలంగాణ టీమ్ కైవసం చేసుకుంది. మూడ్రోజులగా హైదరాబాద్లో జరుగుతున్న ఈ పోటీలు మంగళవారం ముగిశాయి. ఫైనల్లో కెప్టెన్ పి.సందీప్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ జట్టు 45-20తో కేరళను ఓడించి ట్రోఫీను ముద్దాడింది. ఈ పోటీల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీతో సహా మొత్తం 8 రాష్ట్రాలు పాల్గొన్నాయి. అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.వెంకటేష్ విజేత జట్టుకు ట్రోఫీ ప్రదానం చేశారు. తెలంగాణ గెలుపులో కీలకపాత్ర పోషించిన సందీప్ రెడ్డిని వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు.