Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలవుదినంగా ప్రకటన - అంబరాన్నంటిన సంబరాలు
బ్యూనస్ ఎయిర్(అర్జెంటీనా): ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా జట్టు తొలిసారి బ్యూనోస్ ఎయిర్‌కు తెల్లవారుఝామున 3.00గంటలకు చేరుకుంది. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని జట్టు సభ్యులు ఉదయం విమానాశ్రయానికి చేరుకొనేసమయానికి వేలాదిమంది అభిమానులు అక్కడకు విచ్చేశారు. రాజధానికి వెలుపల ఉన్న ఎజీజాలో విమానం నుంచి ఆటగాళ్లు దిగుతుండగా.. వారికి రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలికారు. విమానం నుంచి తొలుత మెస్సీ ప్రపంచకప్‌ను తీసుకొని బయటకు రాగా.. ఆ తర్వాత కోచ్ లియోనెల్ సెలోని విచ్చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క ఆటగాడు బయటకు విచ్చేయగా.. వారి సంతకాలకోసం అభిమానులు ఎగబడ్డారు. 'థాంక్యూ.. ఛాంపియన్స్' అంటూ అభిమానులు బిగ్గరగా కేకలు వేస్తూ.. ఘన స్వాగతం పలికారు. పాప్ సింగర్ రాక్ బ్యాండ్ లా మోస్కా 'ముచాచోన్' పాటతో ఆటగాళ్లను స్వాగతించారు. ఆ తర్వాత ఆటగాళ్లంతా టాప్‌లెస్ బస్ ఎక్కి అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు బయల్దేరి వెళ్లారు. వీరంతా విమాశ్రయాన్ని వీడి వెళ్లేంతవరకు అభిమానులు జాతీయ జెండాలను ఊపుతూనే ఉన్నారు. అదే సందర్భంగా అంబరాన్నంటేలా సంబరాలూ జరుపుకున్నారు. 36 ఏళ్ల తర్వాత తమ జట్టు వరల్డ్ కప్ గెలవడంతో ప్రజలంతా వేడుకల్లో మునిగి తేలారు. బునోస్ఎయిర్స్లో జరిగిన వేడుకల్లో కెప్టెన్ మెస్సీతోపాటు ఆటగాళ్లు పాల్గొన్నారు. దాంతో ప్రభుత్వం మంగళవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. 'దేశం ఎంతగా సంతోషిస్తుందో చూసేందుకు నేను అర్జెంటీనాలో ఉండాలి అనుకుంటున్నా' అని ఫైనల్లో విజయం తర్వాత మెస్సీ అన్నట్టు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది. చివరగా 1986లో డిగో మారడోనా కెప్టెన్సీలో అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2014లోనూ మెస్సీ సారథ్యంలోనే అర్జెంటీనా జట్టు ఫైనల్‌కు చేరినా.. జర్మనీ చేతిలో ఓడి రన్నరప్‌తోనే సరిపుచ్చుకుంది.