Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా మహిళలు 196/4
ముంబయి: సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న టీమిండియా మహిళలు ఐదో, చివరి టి20లో బౌలింగ్‌లో నిరాశపరిచారు. దీంతో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 196పరుగులు చేసింది. ఓపెనర్లు మూనీ(2), లచ్ఫీల్డ్(11) నిరాశపరిచినా.. మెక్ గ్రాత్(26), ఫెర్రీ(18) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత 5 వికెట్‌కు గార్డినర్, హర్రీస్ కలిసి 129పరుగులు జతచేశారు. అంజలి, దీప్తి, షెఫాలీ, వైద్యకు ఒక్కో వికెట్ దక్కాయి. భారత లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మంధాన(4), షెఫాలీ(13) నిరాశపరిచారు. ఆ తర్వాత కెప్టెన్ కౌర్(12), రీచా ఘోష్(10) కూడా రాణించలేకపోయారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(53) అర్ధసెంచరీతో రాణించి చివరి బంతికి ఔటయ్యింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. గ్రాహమ్‌కు నాలుగు, గార్డినర్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో ఐదు టి20ల సిరీస్‌ను ఆసీస్ జట్టు 4-1తో కైవసం చేసుకుంది.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్: మూనీ (బి)అంజలి 2, లిచ్‌ఫీల్డ్ (స్టంప్) రీచా (బి)దీప్తి 11, మెక్ గ్రాత్ (స్టంప్) రీచా (బి)షెఫాలీ 26, ఎలీసా పెర్రీ (సి)హర్లిన్ డియోల్ (బి)దేవిక వైద్య 18, గార్డినర్ (నాటౌట్) 66, హర్రీస్ (నాటౌట్) 64, అదనం 9. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 196పరుగులు.
వికెట్ల పతనం: 1/8, 2/17, 3/55, 4/67
బౌలింగ్: రేణుక 4-1-33-0, అంజలి 3-0-30-1, దీప్తి 4-0-46-1, గైక్వాడ్ 3-0-26-0, షెఫాలీ 2-0-17-1, దేవిక వైద్య 3-0-26-1, రాధా యాదవ్ 1-0-14-0.
టీమిండియా మహిళల ఇన్నింగ్స్: మంధాన (సి)హర్రీస్ (బి)బ్రౌన్ 4, షెఫాలీ వర్మ (సి)సథర్లాండ్ (బి)గార్డినర్ 13, హర్లీన్ డియోల్ (రనౌట్) మెక్‌గ్రాత్/మూనీ 24, కౌర్ (ఎల్బి) సథర్లాండ్ 12, రీచా ఘోష్ (సి)గ్రాహమ్ (బి)గార్డినర్ 10, దీప్తి శర్మ (సి)గార్డినర్ (బి)గ్రాహమ్ 53, దేవిక (స్టంప్)మూనీ (బి)గ్రాహమ్ 11, రాధా యాదవ్ (బి)గ్రాహమ్ 0, అంజలి (సి)గార్డినర్ (బి)మెక్‌గ్రాత్ 4, రేణుక (బి)గ్రాహమ్ 2, రాజేశ్వరి (నాటౌట్) 1, అదనం 8. (20 ఓవర్లలో ఆలౌట్) 142పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/24, 3/47, 4/58, 5/70, 6/88, 7/88, 8/130, 9/137, 10/142
బౌలింగ్: బ్రౌన్ 4-0-31-1, గరాత్ 3-0-21-0, గార్డినర్ 4-0-20-2, కింగ్ 4-0-34-0, మెక్ గ్రాత్ 2-0-17-1, సథర్లాండ్ 1-0-11-1, గ్రాహమ్ 2-0-8-4.