Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్-227ఆలౌట్
ఢాకా: రెండో, చివరి టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఉమేశ్ యాదవ్(4/25), అశ్విన్(4/71), ఉనాద్కట్(2/50) బౌలింగ్‌లో రాణించడంతో బంగ్లాదేశ్ జట్టు 227పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన కెఏల్ రాహుల్ పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయక తొలిరోజే బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేశారు. బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్ మొమినుల్ హక్(84), ముస్తాఫిజుర్ రహీమ్(26), లింటన్ దాస్(25) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్), కేఎల్ రాహుల్ (30బంతుల్లో 3నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు.
227పరుగులకే బంగ్లా ఆలౌట్
టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కలేదు. షాంటో, జాకీర్ కలిసి తొలి వికెట్‌కు 39పరుగులు జతచేశారు. ఆ తర్వాత మోమినుల్ రాణించినా.. కెప్టెన్ షకీబ్(16) నిరాశపరిచాడు.
చివర్లో అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో బంగ్లా 227 పరుగులకు కుప్పకూలింది. పదో స్థానంలో వచ్చిన ఖలిద్ అహ్మద్‌ను అశ్విన్ అవుట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసిన బంగ్లా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. బంగ్లాను ఉమేశ్ యాదవ్ దెబ్బతీశాడు. అతను వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. 68వ ఓవర్ నాలుగో బంతికి ఉమేశ్, నురుల్ హసన్(6)ను ఎల్బీగా అవుట్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ రాహుల్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. దాంతో బంగ్లా 7వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు ఓవర్లో ఉమేశ్ ప్రమాదకరమైన మెహిదీ హసన్ మిరాజ్‌ను వెనక్కి పంపాడు. 15 పరుగులు చేసిన మెహిది, రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో మహినుల్ హక్, మిరాజ్ జోడీ 41 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. లిట్టన్ దాస్ 25, షకిబుల్ హసన్ 16, ముష్ఫికర్ రహీం 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు6 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న ఉనాద్కత్ కీలకమైన జకిర్, ముష్ఫికర్ వికెట్లు పడగొట్టాడు. చిట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
స్కోర్‌బోర్డు..
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాంటో (ఎల్బి)అశ్విన్ 24, జాకిర్ హసన్ (సి)కేఎల్ రాహుల్ (బి)ఉనాద్కట్ 15, మోమినుల్ (సి)పంత్ (బి)అశ్విన్ 84, షకీబ్ (సి)పుజారా (బి)ఉమేశ్ 16, ముస్తఫిజుర్ (సి)పంత్ (బి)ఉనాద్కట్ 26, లింటన్ దాస్ (సి)కేఎల్ రాహుల్ (బి)అశ్విన్ 25, మోహిదీ హసన్ (సి)పంత్ (బి)ఉమేశ్ 15, నూరుల్ హసన్ (ఎల్బి)ఉమేశ్ 6, తస్కిన్ అహ్మద్ (సి)సిరాజ్ (బి)ఉమేశ్ 1, తైజుల్ ఇస్లామ్ (నాటౌట్) 4, ఖలీద్ అహ్మద్ (సి)ఉనాద్కట్ (బి)అశ్విన్ 0, అదనం 11. (73.5ఓవర్లలో ఆలౌట్) 227పరుగులు.
వికెట్ల పతనం: 1/39, 2/39, 3/130, 4/172, 5/172, 6/213, 7/219, 8/223, 9/227, 10/227.
బౌలింగ్: సిరాజ్ 9-1-39-0, ఉమేశ్ 15-4-25-4, ఉనాద్కట్ 16-2-50-2, అశ్విన్ 21.5-3-71-4, అక్షర్ 12-1-32-0.
ఇండియా తొలి ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (బ్యాటింగ్) 3, శుభ్‌మన్ గిల్ (బ్యాటింగ్) 14, అదనం 2. 8ఓవర్లలో 19పరుగులు.
బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 4-2-8-0, షకీబ్ 4-2-11-0.