Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడుతో రంజీ మ్యాచ్
చెన్నై: తమిళనాడుతో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రికీ బురు(62) అర్ధసెంచరీతో మెరిసాడు. దీంతో ఆంధ్ర జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5వికెట్లు నష్టపోయి 162పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 4వికెట్ల నష్టానికి 273పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు జట్టు 345పరుగులకు ఆలౌటైంది. గురువారం ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్(4/37), లలిత్ మోహన్(3/131), కెవి శశికాంత్(2/74) రాణించారు. తమిళనాడు లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో 48పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర ఓపెనర్లు అభిషేక్ రెడ్డి(10), కెప్టెన్ హనుమ విహారి(26), రషీద్(21) నిరాశపరిచినా.. రికీ బురు అజేయ అర్ధసెంచరీతో రాణించారు. మూడోరోజు ఆట నిలిచే సమయానికి ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్ 53ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 162పరుగులు చేసింది. ఆంధ్ర జట్టుకు ఇప్పటికే 114పరుగుల ఆధిక్యత లభించింది. సందీప్, సాయి కిషోర్, విజరు శంకర్, సుందర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
ఇన్నింగ్స్ తేడాతో ఓడిన హైదరాబాద్
రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో ముంబయి చేతిలో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి జట్టు 6వికెట్ల నష్టానికి 651పరుగుల భారీస్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ జట్టు 214పరుగులకే ఆలౌటైంది. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లోనూ ముంబయి బౌలర్ల ధాటికి 220పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబయి జట్టు ఇన్నింగ్స్ 217పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ బుద్ధి(65), తన్మరు అగర్వాల్(39) బ్యాటింగ్‌లో రాణించగా.. తనుష్ కొట్టయిన్(5/82), శామ్స్ ములానీ(4/82) బౌలింగ్‌లో రాణించారు. శ్యామ్ ములానీ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 11వికెట్లను కూల్చి ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.