Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కావల్సింది 87, రేసులో 405మంది క్రికెటర్లు
- నేడు కొచ్చి వేదికగా ఐపిఎల్ మినీ వేలం
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్-16కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా శుక్రవారం జరగనుంది. 10 ఫ్రాంచైజీలు తమకరు అవసరమైన ఆటగాళ్లనే అంటిపెట్టుకోగా.. మిగిలిన ఆటగాళ్లందరినీ వదులుకున్నాయి. వీటిలో ఓ ఫ్రాంచైజీ ఏకంగా కెప్టెన్‌ను కూడా వదులకోవడం విశేషం. దీంతో 2023 ఐపిఎల్‌లో 74మ్యాచ్‌లు జరగనుండగా.. అన్ని ఫ్రాంచైజీలు కలిసి 87మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. మినీ వేలం రేసులో ప్రస్తుతం 405మంది ఆటగాళ్లు ఉన్నారు. ఓవరాల్‌గా 991మంది ఆటగాళ్లు మినీ వేలానికి ముందు ఉన్నా.. ఐపిఎల్ నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 273మంది భారత క్రికెటర్లు ఉండగా.. మరో 132మంది విదేశీ ఆటగాళ్లున్నారు. వీరిలో నలుగురు అసోసియేట్ దేశాలకు వారున్నారు. మినీ వేలం రేసులో నిలిచి మొత్తం ఆటగాళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నవారు 119మంది ఉండగా.. మరో 282మంది జాతీయ జట్ల తరఫున, మిగిలిన నలుగురు అసోసియేట్ దేశాల తరఫున ఆడారు. 10 ఐపిఎల్ ఫ్రాంచైజీలు కలిసి 87మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. ఇందులో 30మంది విదేశీ క్రీడాకారులను కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. ఇక అన్ని ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 206.5కోట్ల నగదును ఖర్చు చేయాల్సి ఉండగా.. అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.42.25కోట్లు ఖర్చుపెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. కోల్కత్తా నైట్‌రైడర్స్ వద్ద అత్యల్పంగా రూ.7.05కోట్లు మాత్రమే ఉంది. వీరిలో రూ.2కోట్ల బేస్ ధరతో 19మంది, రూ.1.50కోట్ల బేస్ ధరతో 11మంది ప్లేయర్స్ ఉండగా... వీరిలో మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్ కూడా ఉన్నారు. అలాగే రూ.కోటి బేస్ ధరతో 20మంది నమోదు చేసుకొన్న ఆటగాళ్లున్నారు. విదేశీ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్‌తో పాటు సామ్ కుర్రాన్, రిలే రూసో, నికోలస్ పురాన్, హ్యారి బ్రూక్, కామెరూన్ గ్రీన్, సికిందర్ రాజా వంటి స్టార్లు వేలంలో ఉన్నారు. అలాగే మయాంక్ అగర్వాల్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవడంతో మినీ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడెవరో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.