Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘనంగా హైదరాబాద్ గ్రాండ్ ప్రీ మోడల్
300 కిమీ స్పీడ్‌తో దూసుకెళ్లిన కార్లు
హైదరాబాద్ గ్రాండ్ ప్రీ మెడల్ పోడియంపై జీన్ ఎరిక్, నిక్ కాసిడి, ఆంటోనియో ఫెలిక్స్. టైటిల్ ప్రదానం చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ స్థాయి ఫార్ములా రేసు టెలివిజన్ తెరలపైనే వీక్షించిన భారతీయ క్రీడాభిమానుల కల నెరవేరింది. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ మన గడ్డపైకి వచ్చింది. హైదరాబాద్ గ్రాండ్ ప్రీతో ఫార్ములా-ఈ రేసు భారత్‌లో అరంగేట్రం చేసింది. మోటార్‌స్పోర్ట్స్ దిగ్గజ జట్లు పోటీపడిన ఎలక్ట్రిక్ కార్ల టాప్ రేసింగ్ హైదరాబాద్ సూపర్ హిట్టు కొట్టింది. 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పోటీపడిన ఈ-రేసులో న్యూజిలాండ్ రేసన్ జీన్ ఎరిక్ వేన్ విజేతగా నిలిచాడు. 2.835 కిలోమీటర్ల హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌పై జీన్ ఎరిక్ 32 ల్యాప్‌లను (రౌండ్లు) 46.01.099 సెకండ్లలో పూర్తి చేసి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నిక్ కాసిడి (46.01.499), ఆంటోనియో ఫెలిక్స్ (46.02.958) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. చారిత్రక హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసుకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ప్రథమ హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసును ప్రత్యక్షంగా 25000 మంది అభిమానులు వీక్షించారు.