Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు వెస్టిండీస్‌తో భారత్ ఢీ
- ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్
కేప్‌టౌన్ (దక్షిణా ఫ్రికా): ఆరంభ మ్యాచ్‌లో దాయాది పాకి స్థాన్‌పై ఏకపక్ష విజ యం, మహిళల ప్రీమియర్ లీగ్‌లో కోట్ల వర్షం ఉత్సా హంలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు.. నేడు మరో సవాల్ కు సిద్ధమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్-2 దశలో నేడు వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. వెస్టిండీస్‌తో గత ఐదు మ్యాచుల్లో ఓలమెరుగని టీమ్ ఇండియా నేడు కేప్‌టౌన్‌లో అదే రికార్డు కొనసాగిం చేందుకు చూస్తుంది. గత మ్యాచ్‌లో అనారోగ్యంతో బెంచ్‌కు పరిమితమైన స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన నేడు కరీబియన్ అమ్మాయిలపై బ్యాట్ ఝులి పించేందుకు సిద్ధమవుతోంది. ఒత్తిడితో కూడిన పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఛేదన విమర్శకుల మెప్పు పొందింది. జెమీమా రొడ్రిగస్, రిచా ఘోష్, షెఫాలీ వర్మలు రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నుంచి జట్టు మెగా ఇన్నింగ్స్ ఆశిస్తోంది. దీప్తి శర్మ, రాధ యాదవ్ బంతితో గొప్ప ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. హేలే మాథ్యూస్, కాంప్బెలె, ఫ్లెచర్‌లు వెస్టిండీస్‌కు కీలకం కాను న్నారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు భారత్, వెస్టిండీస్ ప్రపంచకప్ మ్యాచ్ ఆరంభం కానుంది.