Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8వ వికెట్‌కు 114పరుగుల భాగస్వామ్యం
- భారత్ 262ఆలౌట్
- లియాన్‌కు ఐదు వికెట్లు
న్యూఢిల్లీ: రెండోటెస్ట్‌లో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యత లభిస్తుందనుకున్న దశలో టీమిండియా ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు 114పరుగులు జతచేయడంతో భారతజట్టు తొలి ఇన్నింగ్స్‌లో 262పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు ఆధిక్యత మాత్రమే లభించింది. ఓవర్ నైట్ స్కోర్ 21 పరుగులతో రెండోరోజు ఆటను కొనసాగించిన భారత్‌ను ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ లియాన్ టాప్ఆర్డర్ను కూల్చాడు.
17వ ఓవర్లో కేఎల్ రాహుల్ (17)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న లియాన్.. తన తర్వాతి ఓవర్లో రోహిత్ శర్మ (32), పుజారా(0)లను ఔట్ చేసి భారత్‌ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(4) కూడా నాథన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓ దశలో ఔటైన తర్వాత క్రీజులోకి అక్షర్ పటేల్ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. టీ బ్రేక్‌కు ముందు కుహ్నేమాన్ వేసిన ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. తర్వాత కూడా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. కుహ్నేమాన్ వేసిన 75వ ఓవర్లో సిక్సర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కమిన్స్ వేసిన 79వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. మరో ఎండ్‌లో ఉన్న అశ్విన్(37) అతడికి సహకారం అందించాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్‌ను కమిన్స్ ఔట్ చేయగా.. మార్ఫీ వేసిన తర్వాతి ఓవర్లో సిక్సర్ బాది జోరు మీద ఉన్న అక్షర్.. కమిన్స్ పట్టిన ఓ అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు. షమి (2)ని కుహ్నేమాన్ పెవిలియన్‌కు పంపడంతో భారత్ ఆలౌటైంది. లియాన్‌కు ఐదు, కుహ్నేమన్, మర్ఫీకి రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు శుక్రవారం ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోయి 61పరుగులు చేసింది. ఖవాజా(6) అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయస్ పట్టిన ఓ అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు.
స్కోర్‌బోర్డు...
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 263, రెండో ఇన్నింగ్స్ 61/1
ఇండియా తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి)లియాన్ 32, కేఎల్ రాహుల్ (ఎల్బి) లియాన్ 17, పుజారా (ఎల్బి)లియాన్ 0, కోహ్లి (ఎల్బి)కుహ్నేమన్ 44, శ్రేయస్ (సి)హ్యాండ్ కోంబ్ (బి)లియాన్ 4, జడేజా (ఎల్బి)మర్ఫీ 26, శ్రీకర్ భరత్ (సి)స్మిత్ (బి)లియాన్ 6, అక్షర్ (సి)కమిన్స్ (బి)మర్ఫీ 74, అశ్విన్ (సి)రెన్షా (బి)కమిన్స్ 37, షమీ (బి)కుహ్నేమన్ 2, సిరాజ్ (నాటౌట్) 1, అదనం 19. (83.3 ఓవర్లలో ఆలౌట్) 262పరుగులు. వికెట్ల పతనం: 1/46, 2/53, 3/54, 4/66, 5/125, 6/135, 7/139, 8/253, 9/259, 10/262 బౌలింగ్: కమిన్స్ 13-2-41-1, కుహ్నేమన్ 21.3-4-72-2, లియాన్ 29-5-7-5, మర్ఫీ 18-2-53-2, హెడ్ 2-0-10-0.