Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆరంభ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించనుంది. టీమ్ ఇండియా స్టార్ జెమీమా రొడ్రిగస్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ గురువారం ప్రకటించింది. ఇటీవల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను అందుకున్న మెగ్ లానింగ్ (30).. డబ్ల్యూపీఎల్ కోసం గురువారమే న్యూఢిల్లీకి చేరుకుంది. 132 టీ20ల్లో మెగ్ లానింగ్ 3405 పరుగులు చేసింది. అందులో రెండు సెంచరీలు, 15 అర్థ సెంచరీలు ఉన్యాయి. ఆస్ట్రేలియాకు వంద టీ20ల్లో నాయకత్వం వహించిన మెగ్ లానింగ్..ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచులకు కెప్టెన్సీ వహించిన రికార్డు సొంతం చేసుకుంది.