Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి టెస్టుకూ దూరమైన పాట్ కమిన్స్
- అహ్మదాబాద్‌లో సైతం స్మిత్‌కు సారథ్య పగ్గాలు
ముంబయి : బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో విలువైన టెస్టు విజయం నమోదు చేసిన ఉత్సా హంలో ఉన్న ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురు దెబ్బ!. రెగ్యులర్ కెప్టెన్, స్టార్ పేసర్ పాట్ కమిన్స్ భారత్ తో చివరి టెస్టుకు సైతం దూరమ య్యాడు. కుటుంబ కారణాల రీత్యా న్యూఢిల్లీ టెస్టు అనం తరం స్వదేశానికి వెళ్లిపోయిన పాట్ కమిన్స్.. ఇండోర్ టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. చివరి టెస్టు సమయానికి సైతం కమిన్స్ వచ్చే సూచనలు లేకపోవటంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా అహ్మదాబాద్ టెస్టుకు కమిన్స్ దూరమయ్యాడని తెలిపింది. టెస్టు సిరీస్ అనంతరం భారత్‌తో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో ఆడాల్సి ఉంది. వన్డే సిరీస్ జట్టును సైతం పాట్ కమిన్స్ నడిపించాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి వన్డే సిరీస్‌కు కమిన్స్ అందుబాటులో ఉండేది లేనిది సీఏ వెల్లడించలేదు. దీనిపై మరో వారం రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇక స్పిన్ స్వర్గధామ పిచ్‌లపై నాణ్యమైన పేసర్ పాట్ కమిన్స్ సేవలను కోల్పోవటం ఆస్ట్రేలియాకు పెద్ద సమస్య కాబోదు!. నాయకుడిగా పాట్ కమిన్స్ కంగారూ సేనను నడిపించిన తీరు కంటే.. ఇండోర్ టెస్టులో స్టీవ్ స్మిత్ ఆసీస్‌ను ముందుండి నడిపించిన తీరు విమర్శల మెప్పు పొందింది. కమిన్స్ లేకపోవటంతో సారథ్య పగ్గాలు మరోసారి స్టీవ్ స్మిత్ అందుకోనున్నాడు. ఓ టెస్టులో నాయకుడిగా సిరీస్‌లో బోణీ కొట్టిన స్మిత్.. మరో టెస్టులో కెప్టెన్సీ పగ్గాలతో సిరీస్‌ను సమం చేసేందుకు చూస్తున్నాడు. ఇండోర్ టెస్టులో విజయంతో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు ఆస్ట్రేలియా అర్హత సాధించగా.. ఓ విజయం దూరంలో నిలిచిన టీమ్ ఇండియా చివరి టెస్టుకు ముందు ఒత్తిడిలో పడింది.