Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్)లో భాగంగా యుపి వారియర్స్‌తో మంగళవారం జరిగిన పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. చివర్లో జొన్నాసెన్, రోడ్రిగ్స్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 211పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. లానింగ్ కేవలం 42బంతుల్లోనే 10ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసిన లానింగ్.. చివర్లో జొన్నాసెన్(42నాటౌట్), రోడ్రిగ్స్(34) బ్యాటింగ్‌లో రాణించారు. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. 9 ఓవర్లు పూర్తయ్యాక వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ కొంతసేపు నిలిచిపోయింది. ఆ సమయానికి ఢిల్లీ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. లానింగ్ 53, మరిజన్ కాప్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన వారియర్స్.. ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు. కెప్టెన్ లానింగ్ బ్యాట్‌తో రెచ్చిపోతే, షెఫాలీ ఆమెకు అండగా నిలుస్తూ పరుగులు రాబట్టింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించాక తహ్లియా బౌలింగులో కిరణ్‌కు క్యాచ్ ఇచ్చి షెఫాలీ అవుటైంది. 14 బంతులు ఆడిన షెఫాలీ ఫోర్, సిక్సర్‌తో 17 పరుగులు చేసింది. మరోవైపు లానింగ్ 34 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లతో అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. చివర్లో జొన్నాసెన్(42నాటౌట్; 20బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు), రోడ్రిగ్స్(34నాటౌట్; 4ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్ ఆడడంతో స్కోర్‌బోర్డు పరుగెత్తింది. ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తహ్లియా, సోఫీకి ఒక్కో వికెట్ దక్కాయి.
ఉమెన్స్ డే సందర్భంగా..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం (ఈ నెల 8న) జరిగే డబ్ల్యూపీఎల్ మ్యాచ్ టికెట్లను ఉచితంగా అందించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్‌లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముంబయి వేదికగా జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ టిక్కెట్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు మహిళా ప్రేక్షకులను ఇప్పటికే ఉచితంగా అనుమతిస్తోంది.