Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరౌండ్లోనే లక్ష్యసేన్ ఓటమి
- జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
మాడ్రిడ్: బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ సూపర్-300, జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలిరౌండ్లో భారత యువ షట్లర్ల లక్ష్యసేన్‌కు నిరాశ పరిచాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో లక్ష్యసేన్ 19-21, 16-21తో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపోవ్ చేతిలో వరుససెట్లలో ఓడాడు. ఈ మ్యాచ్‌ను లక్ష్యసేన్ కేవలం 45 నిమిషాల్లోనే ఓటమిని అంగీకరించాడు. భారత టీనేజర్ తస్మిన్ మీర్ క్వాలిఫయింగ్ రౌండ్లో అద్భుత ప్రదర్శన కనబర్చి ప్రధాన టోర్నీలోకి ప్రవేశించినా.. తొలిరౌండ్లోనే 8-21, 10-21తో 8వ సీడ్, థారులాండ్‌కు చెందిన ఛో-ఛువాంగ్ చేతిలో ఓడింది. ఇక మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్ 13-21, 14-21తో 5వ సీడ్ చైనాకు చెందిన ఝి-హి చేతిలో, మిథున్ మంజునాథ్ 8-21, 21-19, 11-21తో మాజీ ప్రపంచ ఛాంపియన్ లో-కెన్-యు(సింగపూర్) చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-బి. సుమిత్ రెడ్డి జోడీ 10-21, 12-21తో స్కాట్లాండ్ జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూశారు. Q