Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి టెస్ట్ బౌలర్ల జాబితా విడుదల
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) తాజా టెస్ట్ బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం తొలిసారి బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అశ్విన్.. బుధవారం ఐసిసి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అండర్సన్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్ నాలుగు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయాడు. దాంతో అశ్విన్, అండర్సన్ ఇద్దరూ 859 ర్యాంకింగ్ పాయింట్లతో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఇక కమ్మిన్స్(ఆస్ట్రేలియా) 849 ర్యాంకింగ్ పాయింట్లతో మూడో స్థానం, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా 807 ర్యాంకింగ్ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. భారత్‌తో జరిగిన మూడో టెస్ట్ రాణించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఏకంగా 9వ స్థానంలోకి దూసుకొచ్చాడు.