Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 70 ఏండ్ల వయసులో రాకెట్ పట్టి, కోర్టులో పాదరసంలా కదులుతూ విజయాలు సాధిస్తున్నారు సదాశివ రెడ్డి. ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నీల్లో సత్తా చాటుతున్న సి.సదాశివ రెడ్డి ఇటీవల ముగిసిన హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పతకం సాధించాడు. మెన్స్ డబుల్స్ (70 ప్లస్ విభాగం)లో వి రామ్మోహన్ రావుతో కలిసి మెడల్ సొంతం చేసుకున్నారు. ఏడు పదుల వయసులో ఆల్ ఇండియా స్థాయిలో సుమారు 20 టోర్నీల్లో పోటీపడిన సదాశివ రెడ్డి యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కెపిహెబిలో రెండు టెన్నిస్ కోర్టులను ఏర్పాటు చేసిన సదాశివ రెడ్డి యువత క్రీడల్లో రాణించేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. సదాశివ రెడ్డి, రామ్మోహన్రావులను హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం అధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి అభినందించారు.