Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ సీజన్‌కు దూరమైన బ్రెజిల్ స్టార్
దోహా: బ్రెజిల్ సూపర్‌స్టార్, పారిస్ సెయింట్ జర్మెన్స్ (పీఎస్జీ) ఫార్వర్డ్ నెరుమార్ జూనియర్ విజయ వంతంగా సర్జరీ చేయించుకున్నాడు. కుడి కాలు చీలమండ గాయానికి గురైన నెరుమార్‌కు దోహాలో శస్త్ర చికిత్స చేశారు. ఈ మేరకు పీఎస్జీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలి పింది. పీఎస్జీ తరఫున గత మూడు మ్యాచులకు దూరమైన నెరుమార్.. ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడు. చికిత్స, రిహాబిలిటేషన్ అనంతరం నెరుమార్ తిరిగి మైదానంలోకి రానున్నాడు. ఇక బుధవారం బేయర్న్ మ్యూనిచ్ చేతిలో 0-2తో ఓడిన పీఎస్జీ చాంపియన్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది. నెరుమార్ గాయానికి గురైన 2019, 2020 సీజన్లలో సైతం పీఎస్జీ చాంపియన్స్ లీగ్ నాకౌట్‌కు చేరలేదు. లియోనల్ మెస్సి, కిలియన్ ఎంబాపె ఇద్దరూ బరిలో నిలిచినా.. పీఎస్జీ విజయం సాధించ లేకపోయింది.