Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ ఆంజనేయగౌడ్ సోమవారం ఎల్బీ స్టేడియంలోని కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాట్స్ ఆధ్వర్యంలోని స్టేడియాల నిర్వహణ, జిల్లా స్థాయిలో క్రీడాధికారు ల పని తీరు, జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు, క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్ అకాడమీలలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి, శాట్స్ వీసీ, ఎండీ సందీప్ కుమార్ సుల్తానియా సహా డిప్యూటీ డైరెక్టర్లు, కోచ్లు పాల్గొన్నారు.