Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్ : కేన్ విలియమ్సన్తోపాటు నలుగురు ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడేందుకు క్రికెట్ న్యూజిలాండ్ అనుమతించింది. శ్రీలంక తో సిరీస్ నుంచి వారికి మినహాయిం పునిస్తూ నిర్ణయం తీసుకుంది. కేన్ విలియమ్సన్ (గుజరాత్ టైటాన్స్), టిమ్ సౌథీ(కోల్‌కతా నైట్‌రైడర్స్), డెవాన్ కాన్వే(చెన్నై సూపర్‌కింగ్స్), మిచెల్ శాంట్నర్(చెన్నై సూపర్ కింగ్స్) ఐపీఎల్లో ప్రాతి నిథ్యం వహిస్తున్నారు. ఫిన్ అలెన్, ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్‌కు తొలి వన్డే అనంతరం ఐపీఎల్లో పాల్గొనేందుకు అను మతి లభించింది. న్యూజి లాండ్-శ్రీలంక మధ్య ఈనెల 25న తొలి వన్డే జరుగ నుండగా, ఐపీఎల్ మార్చి 31న ఆరంభం కానున్నది.