Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెన్నునొప్పికి శస్త్రచికిత్స విజయవంతం
ముంబయి : భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి శస్త్రచికత్స విజయవంతమైంది. గాయంతో 2022 సెప్టెంబర్ నుంచి ఆటకు దూరమైన బుమ్రా ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లో ఆడలేదు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముంగిట వైట్‌బాల్ ఫార్మాట్లో పునరాగమం చేసినా.. గాయం తిరగబెట్టడంతో మళ్లీ ఆటకు దూరమయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్‌లో వెన్నునొప్పి సర్జీరీల నిపుణుడు జశ్‌ప్రీత్ బుమ్రాకు శస్త్రచికిత్స చేశారు. విజయవంతంగా సర్జీరీ ముగించుకున్న బుమ్రా బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపాడు. ' వెన్నుగాయానికి బుమ్రా న్యూజిలాండ్‌లో శస్త్రచికత్స చేసుకున్నాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా శస్త్రచికిత్స విజయంతమైంది. ఆరు వారాల అనంతరం రిహాబిలిటేషన్ మొదలుపెట్టాలని వైద్యులు సూచించారు. శుక్రవారం నుంచి బెంగళూర్‌లోని ఎన్సీఏలో బుమ్రా రిహాబిలిటేషన్ ప్రక్రియ మొదలైందని' జై షా అన్నారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వచ్చే వారంలో శస్త్రచికిత్సకు వెళ్లనున్నాడు. శస్త్రచికిత్స అనంతరం రెండు వారాల పాటు అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలోనే కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్.. అనంతరం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకోనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటనలో వెల్లడించింది.