Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: స్టార్ ఇండియాకు భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) రూ.78.90కోట్ల రుణమాఫీ చేసింది. 2018-2023 మార్చి 31వరకు ఐదేళ్ల కాలానికి స్వదేశంలో జరిగే దేశవాళీ టోర్నీలకు సంబంధించి బిసిసిఐ-స్టార్ మధ్య మీడియా ఒప్పందం ప్రకారం మొత్తం 103 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ బిసిసిఐ 102 మ్యాచ్‌లను మాత్రమే నిర్వహించగలిగింది. దీంతో ఒక్క మ్యాచ్ తగ్గింపుకు గాను స్టార్ మాఫీని కోరడంతో ఆ మ్యాచ్ ఫీజుకు సంబంధించి 78.90కోట్లను బిసిసిఐ మాఫీ చేసింది. 2018-2023 మార్చి 31వరకు స్వదేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి స్టార్ 6,138.1కోట్లకు బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకుంది.