Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐర్లాండ్ 117/7
గాలే: రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు తొలి 6వికెట్ల నష్టానికి 591పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. కెప్టెన్ కరుణరత్నే(179), కుశాల్ మెండీస్(140), ఛండీమాల్(102), సమరవిక్రమ(104) సెంచరీలతో కదం తొక్కారు. ఐర్లాండ్ బౌలర్లు క్యాంపెర్కు రెండు, మార్క్ అడైర్, మెక్బ్రినే, వైట్, ్డడాక్నెల్కు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 7వికెట్ల నష్టానికి 117పరుగులు చేసింది. మెక్కొల్లామ్(35), టెక్టర్(34) టాప్ స్కోరర్స్. సోమవారం ఆట ముగిసే సమయానికి టక్కర్(21), మెక్రబినే(5) క్రీజ్‌లో ఉన్నారు. ప్రభాత్ జయసూరియకు ఐదు, ఫెర్నాండోకు రెండు వికెట్లు దక్కాయి.