Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2008 తర్వాత ఇదే తొలిసారి
చెన్నై: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీకి చెన్నై వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని హాకీ ఇండియా(హెచ్ఐ) సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో 15ఏళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ హాకీ టోర్నీకి చెన్నై ఆతిథ్యమివ్వనుండగా.. చివరిసారిగా 2008లో ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ప్రభుజ్యోతి సింగ్, రాజ్‌పాల్ సింగ్ మరియు శివేంద్రసింగ్ త్రయం ఆతిథ్య హోదాలో దుర్బేధ్యఫామ్తో ఆకట్టుకుంది. మొత్తం ఏడు మ్యాచుల్లో 55గోల్స్ చేయడంతో పాటు ఫైనల్లో దక్షిణ కొరియాపై 7-2గోల్స్ తేడాతో గెలిచి టైటిల్ విజేతగా నిలిచింది. అప్పట్లో బెల్జియం పటిష్టజట్టుగా మారలేదు. ఆ తర్వాత చెన్నై వేదికగా జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 4-1తో ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు చెన్నై వేదికలో అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు జరిగిన సందర్భాలు లేవు. ఆ తర్వాత న్యూఢిల్లీ, ఒడిషాలకు మారింది. ఆతిథ్య భారత్‌తోపాటు జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, చైనా, పాకిస్తాన్‌లు బరిలోకి దిగనుండగా.. టోర్నీ ఆగస్టు 3నుంచి 13వరకు చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జరగనుంది.