Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్‌పై ధోనీసేన గెలుపు
- మాక్స్వెల్, డుప్లెసిస్ పోరాటం వృథా
- కాన్వే, శివం దూబె అర్థ సెంచరీలు
చిన్నస్వామిలో చెన్నై సూపర్‌కింగ్స్ చెలరేగింది. డెవాన్ కాన్వే (83), శివం దూబె (52) అర్థ సెంచరీలతో బెంగళూర్ బౌలర్లపై విరుచుకుపడగా చెన్నై సూపర్‌కింగ్స్ 226/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ ఛేదనలో గ్లెన్ మాక్స్వెల్ (76), డుప్లెసిస్ (62) దంచికొట్టినా.. బెంగళూర్‌పై చెన్నై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
నవతెలంగాణ-బెంగళూర్
సొంతగడ్డపై బెంగళూర్‌కు మరో ఓటమి. 229 పరుగుల రికార్డు ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పోరాడి ఓడింది. గ్లెన్ మాక్స్వెల్ (76, 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), డుప్లెసిస్ (62, 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ మోత మోగించినా.. ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులే చేసింది. 8 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. విరాట్ కోహ్లి (6), మహిపాల్ (0), షాబాజ్ (12) నిరాశపరిచారు. దినేశ్ కార్తీక్ (28, 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు వికెట్ కాపాడుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవాన్ కాన్వే (83, 45 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్‌లు), శివం దూబె (52, 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. అజింక్య రహానె (37, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మోయిన్ అలీ (19 నాటౌట్, 9 బంతుల్లో 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మెరిశారు.
కాన్వే, దూబె ధనాధన్ : టాస్ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పవర్‌ప్లే ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (3) వికెట్ పడగొట్టిన బెంగళూర్.. మంచి బ్రేక్ సాధించింది. కానీ చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ వికెట్‌తో వెనకడుగు వేయలేదు. ఓపెనర్ డెవాన్ కాన్వే (83)తో కలిసి నం.3 బ్యాటర్ అజింక్య రహానె (37) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో డెవాన్ కాన్వే కాస్త నెమ్మదించినా.. అజింక్య రహానె ఎదురుదాడి చేశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో రన్‌రేట్‌ను పెంచాడు. పవర్‌ప్లే అనంతరం చెన్నై సూపర్‌కింగ్స్ 53/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. కాన్వే, రహానె జోడీ రెండో వికెట్‌కు వేగంగా 74 పరుగులు జోడించింది. ప్రథమార్థంలో సూపర్‌కింగ్స్ భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది. రహానె నిష్క్రమించినా.. శివం దూబె (52) ఇన్నింగ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 32 బంతుల్లోనే డెవాన్ కాన్వే అర్థ సెంచరీ సాధించగా.. రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 25 బంతుల్లోనే శివం దూబె అర్థ సెంచరీ కొట్టాడు. కాన్వే, దూబె జోడీ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించింది. చివరి ఓవర్లలో అంబటి రాయుడు (14, 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), మోయిన్ అలీ (19 నాటౌట్, 9 బంతుల్లో 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (10, 8 బంతుల్లో 1 సిక్స్) మెరిశారు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో హర్షల్ పటేల్ రెండు హై నోబాల్స్ సంధించటంతో.. ఆ ఓవర్లో చివరి నాలుగు బంతులను మాక్స్వెల్ పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ : 228/6 (డెవాన్ కాన్వే 83, శివం దూబె 52, సిరాజ్ 1/30, హసరంగ 1/21)
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : 218/8 (మాక్స్వెల్ 76, డుప్లెసిస్ 62, పతీరణ 2/42, తుషార్ 3/42)