Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనూహ్య పరిస్థితి
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)16లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏదీ కలిసి రావటం లేదు. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ పరాజయాలు చవిచూసిన డెవిడ్ వార్నర్‌సేన..ఎయిర్పోర్ట్ లాజిస్టిక్స్‌లో 16 బ్యాట్లు, ప్యాడ్లు సహా ఇతర వస్తువులు పోగొట్టుకుంది. ఇటీవల ఏప్రిల్ 15న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. బెంగళూర్ నుంచి న్యూఢిల్లీకి తిరుగు పయనమైన సమయంలో కిట్ బ్యాగుల నుంచి కొన్ని వస్తువులు మాయమైనట్టు ఆటగాళ్లు గుర్తించారు. ఎయిర్పోర్ట్ నుంచి క్రికెట్ కిట్లు నేరుగా క్రికెటర్లు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నాయి. అక్కడ కిట్ బ్యాగులను చెక్ చేసుకున్న క్రికెటర్లు బ్యాట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్ మాయమైనట్టు గుర్తించారు. దీంతో ఈ విషయంపై విమానాశ్రయంలోని పోలీసులు, లాజిస్టికల్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బ్యాట్లు, ప్యాడ్లు మాయమైన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. డెవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్‌లు మూడేసి బ్యాట్లు పోగోట్టుకోగా.. యశ్ ధుల్ ఐదు బ్యాట్లు కోల్పోయాడు. 'బెంగళూర్ నుంచి తిరిగొచ్చిన అనంతరం కిట్ బ్యాగ్‌లు చూసుకున్న ఆటగాళ్లు అవాక్కయ్యారు. ప్రతి ఒక్క క్రికెటర్ బ్యాగ్‌లో ఏదో ఒకటి తస్కరించారు. ఇటువంటి సంఘటన జరగటం ఇదే ప్రథమం. దీనిపై లాజిస్టిల్ విభాగం, ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ జరుగుతోందని' ఢిల్లీ క్యాపిటల్స్ అధికారి ఒకరు తెలిపారు.