Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుధీర్మన్ కప్‌కు భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ : పతకమే లక్ష్యంగా సుధీర్మన్ కప్‌కు భారత జట్టును ఎంపిక చేశారు. భారత పురుషుల జట్టు గతసారి థామస్ కప్ విజయంతో చరిత్ర సృష్టించగా.. ఈ సారి మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్ విభాగంలో మెడల్ సాధించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల భారత బ్యాడ్మింటన్ సంఘం (బారు) రూపొందించిన నూతన నియామవళి సహా అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీల ఫలితాలను విశ్లేషించి పతకం తీసుకురాగల సత్తా ఉన్న జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు, వరల్డ్ నం.9 హెచ్.ఎస్ ప్రణరులు ఈ సారి భారత జట్టును ముందుండి నడిపించనున్నారు. యువ సంచలనం లక్ష్యసేన్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక కావటం గమనార్హం. మే 14-21 వరకు చైనా వేదికగా సుధీర్మన్ కప్ పోటీలు జరుగనున్నాయి.
భారత జట్టు : హెచ్.ఎస్ ప్రణరు, కిదాంబి శ్రీకాంత్ (మెన్స్ సింగిల్స్). పి.వి సింధు, అనుపమ ఉపాధ్యాయ (ఉమెన్స్ సింగిల్స్). సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి, ఎంఆర్ అర్జున్-ధ్రువ్ కపిల (మెన్స్ డబుల్స్). గాయత్రి గోపీచంద్- ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప-టానిశ క్రాస్టో (ఉమెన్స్ డబుల్స్), టానిశ క్రాస్టో/సాయిప్రతీక్ (మిక్స్డ్ డబుల్స్).
టిమ్ కుక్‌తో షట్లర్ల ముచ్చట : యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో భారత షట్లర్లు యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి ముట్చటించారు. స్మార్ట్‌వాచ్ షట్లర్లకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కుక్కు వివరించారు. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి రాకెట్ పట్టిన టిమ్ కుక్ స్మాష్‌లు సైతం సంధించాడు. పుల్లెల గోపీచంద్, పారుపల్లి కశ్యప్, చిరాగ్ శెట్టిలతో సైతం టిమ్ కుక్ మాటామంతీ కలిపాడు.