Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్షిక క్రీడా క్యాలెండర్ రూపకల్పన
- జిలా క్రీడాధికారులతో సమీక్షలో క్రీడామంత్రి
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఓ స్పోర్ట్స్ కిట్‌ను అందించేందుకు క్రీడామంత్రిత్వ శాఖ, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) సిద్ధమవుతున్నాయి. ప్రతి గ్రామంలో ఇప్పటికే క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కావటంతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్‌లోని టూరిజం భవన్లో బుధవారం జరిగిన జిల్లా క్రీడాధికారుల సమీక్షా సమావేశంలో క్రీడా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలు ఈ మేరకు ప్రకటించారు. రానున్న 15-20 రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌లో ఒలింపిక్ అథ్లెట్లకు స్పోర్ట్స్ కిట్లను అందజేసి బృహత్తర కార్యక్రమం ప్రారంభించనుండగా.. అదేరోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తారని మంత్రి వెల్లడించారు. తెలంగాణను క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వార్షిక స్పోర్ట్స్ క్యాలెండర్ రూపకల్పన చేయాలని, క్షేత్రస్థాయి నుంచే సీఎం కప్ పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో యువజన, క్రీడాకాధికారులుగా సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లను మాత్రమే నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లోని స్టేడియాలను సమ్మర్ క్యాంప్‌ల కోసం సిద్ధం చేయాలని సూచించారు. ఇక శాట్స్ ఆధ్వర్యంలో సొంతంగా యూట్యూబ్ చానల్, మ్యాగజిన్, వెబ్సైట్ ఏర్పాటుకు సైతం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.