Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-16లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 134పరుగులే చేయగా.. ఛేదనలో చెన్నై జట్టు 18.4ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 138పరుగులు చేసి గెలిచింది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ ముందు సన్‌రైజర్స్ బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి (21), మయాంక్ అగర్వాల్ (2)లను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఓపెనర్ హ్యారీ బ్రూక్ మరోసారి నిరాశపరిచాడు. 18 పరుగులు చేసిన బ్రూక్... ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కెప్టెన్ మార్క్రమ్ 12, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ 17 పరుగులు చేశారు. మార్క్రమ్ను తీక్షణ అవుట్ చేయగా, క్లాసెన్‌ను పథీరణ పెవిలియన్ చేర్చాడు. మార్కో జాన్సెన్ 17 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో నిలిచాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, మథీశ పథిరన, ఆకాశ్ సింగ్, మహీశ్ థీక్షణ తలా ఒక వికెట్ తీశారు.
ఛేదనలో చెన్నైకు శుభారంభం దక్కింది. గైక్వాడ్(35), కాన్వే(77నాటౌట్) కలిసి తొలి వికెట్‌కు 87పరుగులు జతచేశారు. ఆ తర్వాత గైక్వాడ్‌ను ఉమ్రన్ రనౌట్ చేయగా.. రహానే(9), రాయుడు(9) మరోసారి నిరాశపరిచారు. ఈ క్రమంలో కాన్వే, మొయిన్(6) కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. మార్ఖండేకు రెండు వికెట్లు దక్కాయి. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో నాల్గో ఓటమిని చవిచూడగా.. చెన్నై జట్టు 4 విజయాలతో మూడోస్థానానికి ఎగబాకింది.
స్కోర్‌బోర్డు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (సి)గైక్వాడ్ (బి)ఆకాశ్ సింగ్ 18, అభిషేక్ శర్మ (సి)రహానే (బి)జడేజా 34, త్రిపాఠి (సి)ఆకాశ్ సింగ్ (బి)జడేజా 21, మార్క్రమ్ (సి)ధోనీ (బి)తీక్షణ 12, క్లాసెన్ (సి)గైక్వాడ్ (బి)పథీరన 17, మయాంక్ అగర్వాల్ (స్టంప్)ధోనీ (బి)జడేజా 2, జాన్సెన్ (నాటౌట్) 17, సుందర్ (రనౌట్) ధోనీ 9, అదనం 4. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 134పరుగులు. వికెట్ల పతనం: 1/35, 2/71, 3/84, 4/90, 5/95, 6/116, 7/134 బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3-0-17-1 దేశ్‌పాండే 3-0-26-0, తీక్షణ 4-0-27-1, మొయిన్ 2-0-18-0, జడేజా 4-0-22-3, పథీరన 4-0-22-1.