Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయంపై సన్‌రైజర్స్ కన్ను
- ఢిల్లీ క్యాపిటల్స్‌తో నేడు పోరు
నవతెలంగాణ-హైదరాబాద్ :ఆరంభంలో రెండు పరాజయాలు.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు. ఇక గాడిన పడినట్టే అనిపించింది. ఇంతలోనే మళ్లీ మరో రెండు ఓటములు. కథ మళ్లీ మొదటికి వచ్చింది!. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)16లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇదీ. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డెవిడ్ వార్నర్ సేన వరుసగా ఐదు మ్యాచుల్లో పరాజయం పాలై..ఈ వారమే గెలుపు రుచి చూసింది. ఆరు మ్యాచుల అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు విజయాలు, ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క విజయమే సాధించాయి. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు కింది నుంచి తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సీజన్లో తొలిసారి ఈ రెండు జట్లు ముఖాముఖికి సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
బ్యాటర్లు మెరిస్తేనే : సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కష్టాలు చవిచూస్తోంది. హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కోల్‌కత నైట్‌రైడర్స్‌పై శతకం బాదినా.. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో సత్తా చాటలేదు. స్పిన్‌పై ఎదురుదాడి చేయలేని బ్రూక్ బలహీనతను ప్రత్యర్థి జట్లు తెలివిగా వాడుకుంటున్నాయి. కెప్టెన్ మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి సైతం నిలకడగా రాణించటం లేదు. హెన్రిచ్ క్లాసెన్ సైతం ఆశించిన మేరకు ఆడటం లేదు. మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా ఐదు మ్యాచుల్లో విఫలమయ్యాడు. దీంతో అతడిని ఆరో స్థానానికి పరిమితం చేశారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అటు బంతితో, ఇటు బ్యాట్‌తో తేలిపోతున్నాడు. ఒక్క వికెట్ తీయని వాషింగ్టన్ సుందర్.. బ్యాటింగ్‌లోనూ తేలిపోయాడు. బ్యాటర్లు ఎవరూ బాధ్యతాయుత ప్రదర్శన చేయకపోవటం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి లాగుతోంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మార్కో జాన్సెన్ రూపంలో పేస్ విభాగం బలంగా ఉంది. స్పిన్నర్ మయాంక్ మార్కెండె సన్‌రైజర్స్ మాయజాలం కష్టాలను తీర్చగలగుతున్నాడు. చీఫ్ కోచ్ బ్రియాన్ లారా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు తుది జట్టులో పలు కీలక మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది.
ఆ ఇద్దరు మినహా : ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరం మరీ దారుణంగా ఉంది. ఆరు మ్యాచుల అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున డెవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా మరో బ్యాటర్ 100కి పైగా పరుగులు చేయలేదు. యువ ఓపెనర్ పృథ్వీ షాతో మొదలవుతున్న కష్టాలకు ఎక్కడా తెరపడటం లేదు.