Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా, ఒలింపిక్స్‌కు అర్హత పోటీలుగా గుర్తింపు
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ మరో జాతీయ క్రీడా ఈవెంట్‌కు వేదిక కానుంది. 76వ సీనియర్ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్ జులై 2-5 వరకు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగనున్నాయి. చివరగా జాతీయ స్విమ్మింగ్ పోటీలకు గువహటి వేదికగా నిలిచింది. 2023 ఆసియా క్రీడలు, 2024 పారిస్ ఒలింపిక్స్ సమీపిస్తుండటంతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లకు అర్హత పోటీలుగా సీనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని వరల్డ్ అక్వాటిక్స్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌లో జరుగనున్న జాతీయ పోటీలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. భారత అత్యుత్తమ స్విమ్మర్లు అందరూ గచ్చిబౌలిలోని ఈతకొలనులో ఆసియా, ఒలింపిక్ బెర్త్‌ల కోసం తాడోపేడో తేల్చుకోనున్నారు.