Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫిడే ప్రపంచ ఛెస్ ఛాంపియన్షిప్
అస్టానా(కజకిస్తాన్): ఫిఢే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 12వ రౌండ్ పోటీలో చైనాకు చెందిన డింగ్ లెరెన్ సంచన విజయం సాధించాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోంనియంచితో జరుగుతున్న టైటిల్ పోరులో చైనా గ్రాండ్ మాస్టర్ అద్భుతంగా పుంజుకున్నాడు. డింగ్ లెరెన్ 1.డి4తో గేమ్‌ను ప్రారంభించగా.. నెపోంనించి ఎన్ఎఫ్6తో గేమ్‌ను ప్రారంభించాడు. 34వ ఎత్తులో ఇయాన్ తప్పిదం చేయడంతో డింగ్ లెరెన్కు కలిసొచ్చింది. ఈ గేమ్‌లో డింగ్ లెరెన్ 38వ ఎత్తు తర్వాత ఇయాన్ ఓటమిని అంగీకరించారు. 14రౌండ్లపాటు సాగే ఫైనల్లో 12వ రౌండ్ ముగిసిన అనంతరం ఇరువురు 6పాయింట్లతో సమంగా ఉన్నారు. మరో రెండు గేమ్‌లు మిగిలి ఉన్నాయి.