Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంటల్యా(టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు భారత స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. బుధవారంతో ముగిసిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 పోటీల అనంతరం జ్యోతి సురేఖతోపాటు పెన్నె హీలో, డన్ ఒలారు, జోసెఫ్ సెప్టెంబర్‌లో మెక్సికోలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించారు. మిగిలిన బెర్త్‌ల భర్తీకి షాంఘై(మే), మెడెల్లిన్(జూన్), పారిస్(ఆగస్ట్)లలో పోటీలు జరనున్నాయి. ఈ అర్హత టోర్నమెంట్లు ముగిసిన అనంతరం అగ్రస్థానంలో ఉన్న ఆర్చర్లు నేరుగా ప్రపంచకప్ ఆర్చరీ ఫైనల్ పోటీలకు అర్హత సాధించనున్నారు. నేడు జరిగిన మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ-ఓఝా జోడీ చైనీస్ తైపీకి చెందిన హి-హుయాన్, ఛీ-లున్-చెన్పై 158-154పాయింట్లతో గెలిచారు. ఇక మెక్సికోలోని హెర్మొసిల్లో వేదికగా సెప్టెంబర్ 9, 10న ప్రపంచకప్ ఆర్చరీ పోటీలు జరగనున్నాయి.