Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యవేక్షణ కమిటీ చెప్పిందదే
- క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేసేందుకు ఏర్పాటైన కమిటీ.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచన చేసింది!. హాస్యాస్పదంగా అనిపిస్తున్నప్పటికీ ఇదే వాస్తవం. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం ఈ విషయం వెల్లడించారు. న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ క్రీడాకారుల నిరసన కార్యక్రమానికి పౌర సమాజం నుంచి మద్దతు వెల్లువెత్తుతున్న తరుణంలో అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. ' 12 గంటల పాటు రెజ్లర్ల సమస్యలు, డిమాండ్లు విన్నాను. పలుమార్లు వారితో చర్చలు జరిపిన అనంతరం పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ విచారణలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించటం, ఫిర్యాదుల కోసం డబ్ల్యూఎఫ్ఐలో కమిటీ ఏర్పాటు ప్రధాన లోపాలుగా తేలింది. అడ్హాక్ కమిటీ పర్యవేక్షణలో రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు ఐఓఏ చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుల కోసం కమిటీ సైతం ఏర్పాటు అవుతుంది. రెజ్లర్ల వాదన వినిపించేందుకు క్రీడాశాఖ అందరికీ అవకాశాలు కల్పించింది' అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.