Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత స్టార్ మల్లయోధుల దాఖలు చేసిన పిటిషనుపై భారత అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. రెజ్లింగ్ క్రీడాకారుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదన వినిపించన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరుతూ రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని వ్యాఖ్యానించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు నోటీసుకు ఢిల్లీ పోలీసులు నేడు సమాధానం ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవశాశం కనిపిస్తుంది.