Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : గెలుపు ఖాయమైన మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌కు కోల్పోయిన లక్నో సూపర్‌జెయింట్స్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌పై చిరస్మరణీయ విజయంతో పుంజుకుంది. ఐపీఎల్‌లోనే రెండో అత్యధిక స్కోరు సాధించిన లక్నో సూపర్‌జెయింట్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 40 బంతుల్లో 72 పరుగులు పిండుకున్న మార్కస్ స్టోయినిస్ లక్నో విజయంలో కీలక భూమిక పోషించాడు. తిరుగులేని ప్రదర్శనతో గెలుపు బాట పట్టిన లక్నోకు మార్కస్ స్టోయినిస్‌కు గాయం కావటంతో ఆందోళన తప్పలేదు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా స్టోయినిస్ చేతికి బంతి బలంగా తగిలింది. బాధతో విలవిల్లాడిన స్టోయినిస్‌కు ఫిజియో తక్షణ ఉపశమనం కలిగించినా.. అతడు మైదానం వీడక తప్పలేదు. భీకర ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ గాయంతో తర్వాత మ్యాచులకు దూరమవుతాడనే భయం లక్నో శిబిరంలో కనిపిస్తుంది. స్టోయినిస్ చేతి వేళ్లకు స్కానింగ్ తీయనున్నారు. ఆ తర్వాత వైద్యులు తదుపరి సూచనలు చేయనున్నారు.