Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెన్స్ డబుల్స్ ఫైనల్లో ప్రవేశం
- ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
దుబాయ్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి కనీసం ఓ రజత పతకం ఖాయం చేశారు. 1971లో దీపూ ఘోష్, రామన్ ఘోష్ సోదరులు మెన్స్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించటమే భారత్‌కు ఈ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన. తాజాగా సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించి 51 ఏండ్ల తర్వాత ఈ విభాగంలో మెడల్ సాధించటమే కాదు ఏకంగా స్వర్ణంపైనే కన్నేశారు. టోక్యో ఒలింపిక్ చాంపియన్స్, చైనీస్ తైపీ స్టార్స్ లీ యాంగ్, వాంగ్ చి లిన్లపై తొలి గేమ్‌లో మనోళ్లు 21-18తో చిత్తు చేశారు. రెండో గేమ్ 13-14తో ఉత్కంఠగా సాగుతుండగా చి లిన్ గాయపడ్డాడు. గాయంతో చైనీస్ తైపీ జోడీ వాకోవర్ ఇవ్వగా.. సాత్విక్, చిరాగ్ టైటిల్ పోరులో అడుగుపెట్టారు. నేడు పసిడి పోరులో ఎనిమిదో సీడ్ మలేషియా జోడీతో సాత్విక్, చిరాగ్ తలపడనున్నారు. మలేషియా జోడీతో మనోళ్ల ముఖాముఖి రికార్డు 3-3తో సమవుజ్జీగా ఉంది.