Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జట్టుతో చేరిన సాకర్ సూపర్‌స్టార్
న్యూఢిల్లీ : ప్రపంచ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, అర్జెంటీనా జాతీయ కెప్టెన్ లియోనల్ మెస్సి మళ్లీ లీగ్ 1 జట్టు పిఎస్జితో కలిశాడు. లీగ్1 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పారిస్ సెయింట్ జెర్మెన్ (పిఎస్జి) గత నెల లోరియంట్ చేతిలో 1-3తో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్ అనంతరం జట్టు యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా లియోనల్ మెస్సి సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లాడు. దీంతో పిఎస్జి యాజమాన్యం మెస్సిపై రెండు వారాల సస్పెన్షన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో మెస్సి ప్రాక్టీస్ సెషన్లో సైతం పాల్గొనకూడదని స్పష్టం చేసింది. సౌదీ అరేబియా టూరిజం ప్రచారకర్తగా కొనసాగుతున్న మెస్సి ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి వెళ్లాడు. వివాదం సమసిపోవటంతో సోమవారం ఉదయం పిఎస్జి ప్రాక్టీస్ సెషన్లో మెస్సి మెరిశాడు. ప్రాక్టీస్ సెషన్లో లియోనల్ మెస్సి ఫోటోను పిఎస్జి సోషల్ మీడియాలో పంచుకుంది. పిఎస్జితో బంధానికి బీటలు రావటంతో వచ్చే సీజన్లో సౌదీ అరేబియా క్లబ్ అల్ హిలాల్ తరఫున ఆడేందుకు మెస్సి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. మెస్సికి సౌదీ క్లబ్ ఆకర్షణీయ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.