Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే విడుదల చేయండి: పాక్ సుప్రీం ఆదేశాలు
- కోర్టు ధిక్కరణ చర్యే
- ఎన్ఏబీ వ్యవహార శైలిని తప్పుబట్టిన న్యాయస్థానం
ఇస్లామాబాద్ : తక్షణమే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. భూ అవినీతికి సంబంధించిన కేసులో ఖాన్‌ను మంగళవారం అవినీతి నిరోధక విభాగం (నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) అరెస్టు చేసిన తీరుతో దేశవ్యాప్తంగా నిరసనలు తలెత్తాయి. దాంతో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఇస్లామాబాద్ హై కోర్టును శుక్రవారం ఆశ్రయించాలని, కోర్టు తీసుకునే నిర్ణయాన్ని ఆమోదించాలని సుప్రీం కోర్టు ఇమ్రాన్‌కు తెలియజేసింది. తన అరెస్టు తర్వాత చెలరేగిన హింసాత్మక నిరసనలను ఖాన్ ఖండించాలని పాక్ ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్లు మరో మీడియా వార్త పేర్కొంది. సుప్రీం కోర్టులో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, హైకోర్టులో తనను కిడ్నాప్ చేశారని, కర్రలతో బాదారని చెప్పారు. తన అరెస్టు తర్వాత దేశంలో ఏం జరుగుతోందో కూడా తనకు తెలియ దని ఆయన చెప్పారు. ''దేశానికి ఏం నష్టం జరగదు, పార్టీ సభ్యులు, కార్యకర్తలు ప్రశాంతంగా వుండాలి.'' అని ఆయన కోరారు. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు ఆవరణలో ఖాన్‌ను ఎన్ఏబీ అరెస్టుచేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి భయం, బెదిరింపులు లేకుండా న్యాయం అందరికీ అందాలన్నది ప్రతి ఒక్కరి హక్కని, తాజా చర్య, ఆ హక్కును తిరస్కరించడమే కాగలదని పేర్కొంది. ''ఒక వ్యక్తి కోర్టుకు లొంగిపోతే, అప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేయడమంటే అర్థం ఏమిటి?'' అని ప్రశ్నించింది. గంటలోగా న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిందిగా ఎన్ఏబీని ఆదేశించింది. దాంతో వెంటనే ఇమ్రాన్‌ను న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. తన అరెస్టును వ్యతిరేకిస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సుప్రీం కోర్టును ఆశ్రయిం చారు. దానిపై విచారణ జరిపిన న్యాయ స్థానం ఇమ్రాన్ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.
శాంతియుతంగా వ్యవహరించండి : అధ్యక్షుడు అరిఫ్ అల్వి
దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, అశాంతి పై పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వి ఆందోళన వ్యక్తం చేశారు. బలవంతపు చర్యలు, అరెస్టుల కన్నా రాజ కీయ పరిష్కారాల కోసం చూడాలని కోరారు. దేశం లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే, ఆం దోళనగా, దిగ్భ్రాంతికరంగా, తీవ్రంగా కలచి వేసేవి గా వున్నాయని ఈ మేరకు ట్వీట్ చేశారు. చట్టపరిధి లో నిరసనలు వుండాలని సూచిస్తూ, శాంతియుతం గా వ్యవహరిం చాల్సిందిగా ప్రజలను కోరారు.
నిరసనల్లో 8 మంది మృతి
ఇప్పటివరకు పాక్‌లో చెలరేగిన నిరసనల్లో ఎనిమిది మంది మరణించగా, దాదాపు 300మంది గాయపడ్డారు. దేశంలో పలుచోట్ల శాంతి భద్రతల అధికారులతో నిరసనకారులు ఘర్షణ పడ్డారు. లాహోర్, పెషావర్ల్లో గృహ దహనాలు, కాల్పులతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.